గొప్ప ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన “Ionisation Formula” ఖగోళ శాస్త్రవేత్తలకు గొప్పవరం. ఈ సూత్రం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని యొక్క నక్షత్రాల యొక్క ఉష్టోగ్రతను, ఒత్తిడిని, ఇతర అంశాలను కనుగొనవచ్చు.
సాహ గారు “Thermal Ionisation of Atoms” గురించి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. దీని ద్వారా నక్షత్రాల యొక్క భౌతిక లక్షణాలను కనుగొనవచ్చు. వీరు రెండు గొప్ప పుస్తకాలను ప్రచురించారు. అవి 1. A Text Book of Heat ఈ పుస్తకం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తగా భౌతిక శాస్త్రప్రామాణిక గ్రంధంము. 2. Principle of Relativity అనే పుస్తకాన్ని సాహ సత్యేంద్రనాథ బోస్ తో కలిసి రచించారు. ఇది కూడా నేటికీ ఒక ప్రామాణిక గ్రంథంగా పరిగణింప బడుతూ ఉంది.
సాహ Science and Culture అనే పత్రికను స్థాపించాడు. ఇతను 1952-56 మధ్య పార్లమెంట్ సభ్యుడు కూడా.